హెచ్‌-1బి దరఖాస్తు రుసుము పెంపు

పది డాలర్లు పెంచిన ట్రంప్ సర్కారు

H1B VISA
H1B VISA

వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగాలకు అవసరమైన హెచ్ 1 బి వీసా దరఖాస్తు రుసుంను అమెరికా పది డాలర్లు పెంచింది. హెచ్ 1 బి వీసాల తాజా ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ చర్యకు దిగారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని ఈ దరఖాస్తు రుసుంను వీసాల సముచిత ఎంపిక జారీ ప్రక్రియలో భాగంగా పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలసల విభాగం (యుఎస్‌సిఐఎస్) తెలిపింది. దరఖాస్తుదారులు, ప్రభుత్వ సంస్థలకు ఈ వీసాల పరిమితుల నేపథ్యంలో ఎంపిక ప్రక్రియకు ఈ పెంపుదల ఉపకరిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. భారతీయ ఐటి నిపుణులు అత్యధికంగా ఈ వీసాలను ఆశిస్తున్నారు. ఇటీవలి కాలంలో ట్రంప్ అధికార యంత్రాంగం నుంచి ఈ వీసాలకు తీవ్ర స్థాయి కట్టడి ఎదురవ్వడంతో తల్లడిల్లుతున్నారు. ఎంపిక ప్రక్రియ సవ్యంగా జరగాలనేదే తమ ఆలోచన అని యుఎస్‌సిఐఎస్ తాత్కాలిక డైరెక్టర్ కెన్ కుకినెల్లి వార్తా సంస్థలకు తెలిపారు. రుసుం నాన్ రిఫండబుల్‌గా ఉంటుంది. దరఖాస్తుల నమోదు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో ఉంటుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/