యుఎస్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఖతర్‌ ట్రైనింగ్‌ క్యాంపు రద్దు

రాజకీయ ఉద్రిక్తతల కారణంగానే అని యుఎస్‌ సాకర్‌ ఫెడరేషన్‌ వెల్లడి

US football team
US football team

వాషింగ్టన్‌: యునైటెడ్‌ స్టేట్స్‌ పురుషుల జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు ఖతర్‌లో హాజరు కావాల్సిన ట్రైనింగ్‌ క్యాంపును రద్దు చేసుకుంది. మిడిల్‌ ఈస్ట్‌లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్‌ సాకర్‌ ఫెడరేషన్‌ తన అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేసింది. రద్దయిన ఈ ట్రైనింగ్‌ క్యాంపు జనవరి 5 నుంచి 25 మంది ఆటగాళ్లతో దోహాలోని ఆస్పైర్‌ అకాడమీలో ప్రారంభం కానున్న 20 రోజులు జరగనుందని యుఎస్‌ కోచ్‌ గ్రెగ్‌ బెర్హాల్టర్‌ తెలిపారు. నిన్న బాగ్దాద్‌ అంతర్జాతీయ విమనాశ్రయం వద్ద అమెరికా చేపట్టిన డ్రోన్‌ దాడి గురించి తెలిసిన విషయమే. కాగా ఈ నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ట్రైనింగ్‌ క్యాంపుని రద్దు చేశారు. యుఎస్‌ సాకర్‌ ఫెడరేషన్‌ తన ట్విట్టర్‌లో మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా పురుషుల జాతీయ జట్టు ట్రైనింగ్‌ క్యాంప్‌ కోసం ఖతర్‌ ప్రయాణాన్ని వాయిదా వేయాలని యుఎస్‌ సాకర్‌ నిర్ణయించింది. కాలిఫోర్నియాలోని డిగ్నిటీ హెల్త్‌ స్పోర్ట్స్‌ పార్కులో ఫిబ్రవరి 1న కోస్టారికాతో మ్యాచ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం అని పోస్టు చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/