జార్జి ఫ్లాయిడ్ హత్య కేసు..పోలీస్ అధికారికి 22.5 ఏళ్ల జైలు
us-ex-police-officer-sentenced-to-over-22-years-for-george-floyd-murder
వాషింగ్టన్ : ఆఫ్రికా అమెరికన్ జార్లి ఫ్లాయిడ్ మరణానికి కారణమైన మాజీ పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌కు మిన్నియా పొలిస్‌కోర్టు ఇరవైరెండున్నరేళ్ల కారాగార శిక్ష విధించింది. చౌవిన్ సత్ప్రవర్తనను కనబరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత అతనికి పెరోల్‌కు అనుమతించవచ్చని స్పష్టం చేసింది. ప్రతిపాదిత మార్గదర్శకాల్లో ఉన్నట్టు ఎక్కువ కాలం జైలు శిక్ష విధించాలన్న ప్రాసిక్యూటర్ విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ విధంగా తీర్పునిచ్చింది. ‘శిక్ష భావోద్వేగం, సానుభూతిపై ఆధారపడి లేదు’ అని న్యాయమూర్తి పీటర్ కాహిల్ అన్నారు. ప్రాసిక్యూటర్లు 30 సంవత్సరాల శిక్షను కోరిన తర్వాత మిన్నియాపాలిస్ కోర్టు ఫ్లాయిడ్ హత్య దశాబ్దాలుగా జాతి న్యాయం కోసం అమెరికా చేసిన అతిపెద్ద ప్రదర్శనలకు దారితీసింది.
కాగా, పోయినేడాది మే 25న జార్జ్ ఫ్లాయిడ్‌ను నడిరోడ్డుపై డెరిక్ చౌవిన్ మోకాలితో నొక్కి అదిమిపట్టాడు. తనకు ఊపిరి ఆడడం లేదని, కాలు తీయాలని ఫ్లాయిడ్ వేడుకున్నా డెరిక్ కనికరించలేదు. ఆ తర్వాత ఫ్లాయిడ్‌ను ఆసుపత్రికి తరలించగా మరణించాడు. ఇందుకు సంబంధించి వీడియోలు, పొటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/