అమెరికాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

ఒక్కరోజే అమెరికాలో 1,84,591 కేసులు నమోదు

america coronavirus

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఆదివారం ఒక్కరోజే అమెరికాలో 1,84,591 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,20,28,081కు చేరింది. మరోపక్క అమెరికాలో నిత్యం మరణాలు కూడా వెయ్యికు పైగా నమోదవుతున్నాయి. ఆదివారం కరోనా బారిన పడి 1,476 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,55,076గా ఉంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వస్తే తప్పకుండా ఫేస్‌మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు.

కాగా.. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా ఫార్మా సంస్థలు తమ వ్యాక్సిన్ వైరస్‌పై 90 శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించాయి. దీంతో మరికొద్ది రోజుల్లోనే విజయవంతమైన వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఫైజర్ వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ అప్రూవల్ లభిస్తే డిసెంబర్‌లోనే రెండు కోట్ల మంది అమెరికన్లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/