అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ వార్‌

‘అలీబాబా’పై ట్రంప్‌ కన్ను

Trump
Trump

వాషింగ్టన్‌,: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే చైనీస్‌ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌కు 90 రోజుల గడువు ఇచ్చారు.

తాజాగా ఇతర చైనీస్‌ కంపెనీలు, యాప్స్‌కు షాకిచ్చే సంకేతాలు ఇచ్చారు అమెరికా అధ్యక్షులు. చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తమకు అందుబాటులో ఉన్నఅన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు.

చైనాకు చెందిన అలీబాబా వంటి ఇతర సంస్థలపై ఆంక్షలను పరిశీలిస్తారా అని మీడియా అడగ్గా, అవును, ఇతర అంశాలను పరిశీలిస్తామన్నారు.

అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ వార్‌ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ఈ ట్రేడ్‌వార్‌ మరింతగా ముదిరింది.

ఇప్పటికే టిక్‌టాక్‌కు హెచ్చరికలు జారీచేసిన ట్రంప్‌ అలీబాబా వంటి దిగ్గజ సంస్థలపై దృష్టిసారించారు. ఆయన కార్యవర్గం వీటిని సమీక్షించే అవకాశం ఉందని అమెరికా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

గత వారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో కూడా అలీబాబా పేరును ప్రస్తావించారు. అమెరికా టార్గెట్‌లో జాక్‌మాకు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు.

బైట్‌డ్యాన్స్‌ సంస్థకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశ కంపెనీకి విక్రయించడమో చేయాలని చెప్పిన ట్రంప్‌, ఇందుకు తొలుత 45 రోజుల గడువు ఇచ్చారు.

ఆ తర్వాత దీనిని 90 రోజులకు అంటే నవంబరు 12వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపైట్రంప్‌ సంతకం చేశారు.

అమెరికా జాతీయ భద్రతను బైట్‌ డ్యాన్స్‌ ప్రమాదంలోకి నెడుతోందనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/