అమెరికా- చైనా..కొనసాగుతున్న ట్రేడ్‌ వార్‌

trump, jinping
trump, jinping

చైనా: అమెరికాచైనా మధ్య ట్రేడ్‌ వార్‌ ఇంకా కొనసాగుతోంది. తమ వస్తువులపై చైనా సుంకాలు పెంచడాన్ని సహించలేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆ దేశంపై కారాలుమిరియాలు నూరారు. చైనా చర్యకు నిరసనగా ఆ దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించేందుకు దాదాపు ఎనభై కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆంక్షలను విధించారు. దీనివల్ల అమెరికాలో చైనా సరుకులకు డిమాండ్‌ తగ్గిపోయింది. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికా మీద తమ ట్రేడ్‌ వార్‌ కొనసాగుతుందని హెచ్చరించారు. అవసరమైతే యూఎస్‌తో శాశ్వతంగా తమ వాణిజ్య లావాదేవీలను నిలిపివేస్తామని కూడా పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/