అమెరికా వైమానిక విన్యాసాలు

చైనా: దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా సైనిక సన్నాహాలను ప్రారంభించింది. వైమానిక విన్యాసాలు నిర్వహించేందుకు ఈ ప్రాంతానికి చేరుకున్న అమెరికా విమాన వాహకనౌక యుఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ ఇందుకు సన్నద్ధమైంది. బలప్రదర్శనతో శాంతి సాధన అన్న సూత్రాన్ని అనుసరించి నిర్వహించనున్న ఈ విన్యాసాలకు కొంతమంది ఫిలిప్సైన్ వాయుసేనాధికారులను మంగళవారం ద్వారా ఈ విమానవాహకనౌక పైకి తరలించారు. నావికా స్వేచ్ఛ పేరిట ఈ ప్రాంతాన్ని తన కవ్వింపు చర్యలతో ఇప్పటికే వివాదాస్పదంగా మార్చిన అమెరికా చైనా ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతంలోని పారాసెల్ దీవుల వద్ద చైనా రెండు రోజుల సైనిక విన్యాసాలు నిర్వహించిన కొద్దిరోజులకే అమెరికా తన వైమానిక విన్యాసాలకు రంగం సిద్దం చేసుకుంటోంది.
తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/photo-gallery/