పాకిస్థాన్ గగనతలాన్ని వాడరాదు

అమెరికా నిషేధాజ్ఞలు జారీ చేసింది

airspace
airspace

అమెరికా: పాకిస్థాన్ గగనతలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని అమెరికా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఈ మేరకు యూఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఎయిర్ లైన్స్ సంస్థలకు, వాటిల్లో పనిచేసే పైలెట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ ను వాడటం రిస్క్ తో కూడుకున్నదని, తీవ్రవాదులు, మిలిటెంట్ కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయని, విమానాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని యూఎస్ అభిప్రాయపడింది. యూఎస్ పౌర విమానయాన కార్యకలాపాలకు పాకిస్థాన్ గగనతలంపై అవాంతరాలు ఏర్పడవచ్చని భావించిన మీదటే ఎఫ్ఏఏ, ‘నోటామ్’ (నోటీస్ టూ ఎయిర్ మ్యాన్) జారీ చేసిందని అమెరికా అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 30 తేదీతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది అన్ని యూఎస్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థలకు, పైలెట్లకూ వర్తిస్తుందని పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/