ప్లాస్మా చికిత్సకు ఓకే చెప్పిన ఎఫ్‌డీఏ

trump

వాషింగ్టన్‌: ప్లాస్మా చికిత్స‌కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్‌(ఎఫ్‌డీఏ) ఓకే చెప్పింది. ఈ విష‌యాన్ని ఆ దేశాధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్‌తో బాధ‌ప‌డుతున్న ‌రోగుల‌కు ఈ చికిత్స‌ను అందిచ‌నున్నారు. యాంటీబాడీలు అధికంగా ఉండే బ్ల‌డ్‌ప్లాస్మాను ఈ టెక్నిక్‌లో వినియోగిస్తారు. వ్యాధి నుంచి కోలుకున్న వారి నుంచి తీసిన ప్లాస్మాను కోవిడ్ రోగుల‌కు ఇవ్వ‌నున్నారు. అమెరికాలో ఈ ప‌ద్ధ‌తిలో ఇప్ప‌టికే 70వేల మందికి చికిత్స చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ చికిత్స విధానం వ‌ల్ల దేశంలో మ‌ర‌ణాల‌ను 35 శాతం త‌గ్గించ‌వ‌చ్చు అని అధ్య‌క్షుడు ట్రంప్ తెలిపారు. వ్యాక్సిన్ల‌ను, మందుల‌ను రిలీజ్ చేయ‌డంలో ఎఫ్‌డీఏ జాప్యం చేస్తున్న‌ట్లు ట్రంప్ ఆరోపించిన కొన్ని రోజుల‌కే కొత్త విధానికి గ్రీన్ సిగ్న‌ల్ దొరికింది. రిప‌బ్లిక‌న్ పార్టీ జాతీయ స‌మావేశాల నేప‌థ్యంలో ట్రంప్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/