అమెరికాలో కాల్పుల మోత..యకిమాలో ముగ్గురు మృతి

యకీమాలోని కన్వీనియెన్స్ స్టోర్‌లో ఘటన

US: 3 killed in ‘random’ shooting at convenience store in Yakima, Washington

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకుల మోత ఇంకా కొనసాగుతోంది. సోమవారం జరిగిన కాల్పుల్లో 11 మంది మృత్యువాతపడగా.. మంగళవారం ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వాషింగ్టన్ స్టేట్‌లోని యకిమా నగరంలోని కన్వీనియన్స్ స్టోర్‌లో కాల్పులు జరిగాయి. సాయుధుడు ఒక్కసారిగా 21 మందిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడని పేర్కొన్నారు. దాదాపు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కాల్పులకు సంబంధించి సమాచారం అందిందని చెప్పారు.

ఘటన అనంతరం దుకాణం లోపల, వెలుపల ముగ్గురి మృతదేహాలను పోలీసులు పేర్కొన్నారు. మృతులు, కాల్పులు జరిపిన వ్యక్తికి మధ్య ఎలాంటి ఘర్షణ జరుగలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల సంఘటనలో ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో అమెరికాలో గన్‌ కల్చర్‌ విపరీతంగా పెరిగింది. షాపింగ్‌ మాల్స్‌, పార్టీలు జరిగే ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి కాల్పులకు తెగబడడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/international-news/