ఆజంఘడ్‌ మదరసా విద్యార్ధికి సివిల్స్‌లో ర్యాంకు

shahid raza khan
shahid raza khan, civils ranker


న్యూఢిల్లీ: ఆజంఘడ్‌ మదరసా విద్యార్ధి షాహిద్‌ రజా ఖాన్‌ యూపిఎస్సీ పరీక్షల్లో 751 వ ర్యాంకు సాధించి సివిల్స్‌కు ఎంపికయ్యారు. ఆజంఘడ్‌ మదరసా తాను బాగా చదువుకునేందుకు ఉపయోగపడిందని సివిల్స్‌ ర్యాంకర్‌ షాహిద్‌ రజా ఖాన్‌ చెప్పారు. కైఫీ ఆజ్మీ, షిబ్లీ నోమానీల జన్మస్థలమైన ఆజంఘడ్‌ మదరసా తాను చదువుకునేందుకు ఉపయోగపడిందని ఖాన్‌ పేర్కొన్నారు. బీహార్‌ గయా పట్టణానికి చెందిన షాహిద్‌ తన ప్రాథమిక విద్య ఆజంఘడ్‌లోని మదరసాలోనే సాగిందని చెప్పారు. తాను మదరసాలో ఉర్దూ భాషలోనే చదివి అదే ఆప్షనల్‌గా యూపిఎస్సీ పరీక్ష రాశానని చెప్పారు. తన తల్లితో పాటు మదరసాలోనే తాను స్పూర్తి పొంది సివిల్‌ సర్వీసుకు ఎంపికయ్యానని చెప్పారు. తనకు మతం మానవత్వాన్ని నేర్పిందని ఖాన్‌ చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/