మా అబ్బాయిని వేధించొద్దు : అభిషేక్‌ తల్లి ఉప్పల శారద

ఎవరో తెచ్చుకున్న డ్రగ్స్‌కు తన కుమారుడిని బలి చేయవద్దని పోలీసులకు వినతి

Abhishek's mother Uppala Sarada's response to pudding mink pub drugs case
Abhishek’s mother Uppala Sarada’s response to pudding mink pub drugs case

Hyderabad: బంజారాహిల్స్‌లోని పుడింగ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ రోజు రాత్రి పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు యజమానులతో సహా 142 మంది పేర్లతో జాబితాను పోలీసులు విడుదల చేశారు. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖ సెలబ్రిటీలు, ఉన్నతాధికారుల పిల్లలుతోపాటు , ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. ఈ వ్యవహారంలో పబ్‌ యజమానిగా జాబితాలో అభిషేక్‌ పేరు ఉంది.. దీంతో అభిషేక్‌ తల్లి ఉప్పల శారద స్పందించారు. ఈమేరకు మీడియాతో మాట్లాడారు. తన కురుమారుడి పై అసత్య ప్రచారాలు చేయవద్దని, అభిషేక్‌ నిరపరాధి అంటూ పేర్కొన్నారు . ఎవరో తెచ్చుకున్న డ్రగ్స్‌కు తన కుమారుడిని బలి చేయవద్దని , వేధించవద్దని శారద పోలీసులను కోరారు.

పబ్‌కి తన కుమారుడు యజమాని కాదని, . కేవలం పార్టనర్ మాత్రమే అని పేర్కొన్నారు. రాడిసన్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ అని , 24 గంటల పర్మిషన్ ఉందని చెప్పారు. పార్టీకి వచ్చిన 148 మందిలో ఎవరి జేబులో డ్రగ్స్ ఉన్నాయో ఎవరు డ్రగ్స్ తెచ్చారో తమకు తెలియదు.వచ్చిన వారిలో ఎవరి బ్లడ్ లో డ్రగ్స్ ఉందో టెస్టులు చేయకుండా ఎలా పంపించేస్తారారని ప్రశ్నించారు. అందర్నీ వదిలేసి తన కుమారుడిని మాత్రమే ఎందుకు వేధిస్తున్నారంటూ ప్రశ్నించారు.

తెర (సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/