17.29లక్షలకోట్లకు పెరిగిన యుపిఐ లావాదేవీలు

UPI
UPI


మంగుళూరు, యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యుపిఐ)లావాదేవీలురానురాను పుంజుకుంటున్నాయి. ఇప్పటివరకూ యుపిఐ వెయ్యికోట్లకుపైబడిన లావాదేవీలునిర్వహించింది.యుపిఐ ప్లాట్‌ఫామ్‌కింద సుమారు 17.29 లక్షలకోట్లమేర మూడేళ్లపాటు లావాదేవీలునిర్వహించింది. అంటే ప్రారంభంనుంచి కూడా ఈ డిజిటల్‌ లావాదేవీలకు మంచి ప్రోత్సాహం లభించింది. మూడేళ్లలోనే యుపిఐ ప్లాట్‌ఫామ్‌ సరికొత్త మైలురాయిని నమోదుచేసింది. 2016లో ప్రారంభించిన తర్వాత భారత జాతీయ చెల్లింపులసంస్థ (ఎన్‌పిసిఐ) 2019 ఆగస్టు వరకూ 1,029.44 కోట్ల లావాదేవీఉల నిర్వహించింది. కేవలం మొబైల్‌ ద్వారా మాత్రమే చెల్లింపులజరిపే ఈ వ్యవస్థకు మొత్తం 37 నెలల్లో 17.29 లక్షలకోట్లు లావాదేవీలునిర్వహించినట్లు వెల్లడించింది. మొత్తం లావాదేవీలసంఖ్య 819.03 కోట్లు కాగా ఈ లావాదేవీలద్వారా 14.11 లక్షలకోట్లు లావాదేవీలుజరిగాయి. సెప్టెంబరు 2018 నుంచి ఆగస్టు 2019 మధ్యకాలంలోనే ఈ లావాదేవీలు 81.60శాతం వాటాతో ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాతరోజుల్లో కూడా యుపిఐ డిజిటల్‌ చెల్లింపులకు పెద్దపీటవేసింది. 2016 డిసెంబరులోనే 19 లక్షల లావాదేవీలుజరిగాయి. నెలవారీ లావాదేవీల మూడులక్షలలోపు ఉన్నవే ఎక్కువ జరిగాయి. భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ (భీమ్‌) యాప్‌ను ఎన్‌పిసిఐ ప్రారంభించిన తర్వాత మరింతగా చెల్లింపుల్లో వృద్ధి కనిపించింది. భీమ్‌ యాప్‌ద్వారా మొత్తం లావాదేవీలు యుపిఐ ప్లాట్‌ఫామ్‌పై 41.36శాతంగా ఉన్నాయి. జనవరి 2017నుంచి చూస్తే ఆగస్టు 2019 నాటికి 1.82శాతంపెరిగాయి. భీమ్‌ యాప్‌ద్వారా చెల్లింపులు జనవరిలో కొంత తగ్గాయి. ప్రారంభంలోయుపిఐ పి2పి చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌గా పనిచేసింది. టెక్నాలజీ కంపెనీలు ఈ సెగ్మెంట్‌లోనికి రావడంతో వ్యక్తులనుంచి వ్యాపారులవరకూ పి2ఎం విభాగానికి కూడా యుపిఐ విస్తరించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/