రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఉపాసన నాయనమ్మ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు. నానమ్మ చివరి వరకు ఎంతో ప్రేమ, గౌరవంతో నిండిన జీవితాన్ని గడిపారని తెలిపారు.

జీవితాన్ని ఎలా జీవించాలో ఆమె ద్వారానే తాను తెలుసుకున్నానని వెల్లడించారు. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపింది. తన గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఎలాంటి అనుభూతులను పొందానో వాటన్నింటినీ తన పిల్లలకు అందిస్తానని చెప్పుకొచ్చింది. నాయనమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం ఉపాసన కడుపుతో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే మెగా ఫ్యామిలీ లోకి మరో బిడ్డ రాబోతుంది. ఆ క్షణం కోసం మెగా ఫ్యామిలీ తో పాటు మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.