ఈ 23 విపక్ష సమావేశానికి స్టాలిన్‌కు ఆహ్వానం

mk stalin
mk stalin

చెన్నై: డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సోనియాగాంధీ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ నెల 23న ఢిల్లీలో జరగనున్న ప్రతపక్షాల భేటికి హాజరుకావాలని స్టాలిన్‌కు పిలుపు నిచ్చారు. బిజెపియేతర ప్రభుత్వ ఏర్పాటుకు సోనియా గాంధీ అడుగులు వేస్తున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 23న సోనియా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి యూపిఏ భాగస్వామ్య పక్షాలతో తటస్థ పార్టీలను సోనియా ఆహ్వానించారు. ఇప్పటికే బిజెడి, వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్‌ ,టిడిపిలను సమావేశానికి ఆమె ఆహ్వానించారు. ఫలితాలు వచ్చిన వెంటనే తటస్థ పార్టీలను యూపిఏలోకి తెచ్చే ప్లాన్‌ చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/