ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం అయోధ్యలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా , పలువురుకి గాయాలయ్యాయి. 16 మందితో ప్రవైట్ ట్రావెల్ బస్సు కర్ణాటక నుంచి అయోధ్యకు వెళ్తుండగా.. మోతీపూర్ ప్రాంతంలోని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారని, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ తెలిపారు.

మిగిలిన క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. దీనిపై విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ తెలిపారు. ఇదిలాఉండగా దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు.