వలస కూలీల ప్రమాద ఘటనపై సిఎం యోగి దిగ్భ్రాంతి

బాధిత కుటుంబాలకు సిఎం ప్రగాఢ సానుభూతి

Yogi Adityanath
Yogi Adityanath

యుపీ: ఈరోజు ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈఘటనపై యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వలస కార్మికుల మరణం దరదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అవినాశ్ అవస్థి తెలిపారు. కాగా వలస కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయా వద్ద మరో ట్రక్కు దానిని ఢీకొట్టింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/