ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్.. ఏడుగురు మృతి

లక్నో: ఉత్తర్ప్రదేశ్ బరేలీలోని ఫతేగంజ్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. భోజిపుర నుంచి దిల్లీ వెళుతున్న అంబులెన్స్ అదుపు తప్పి.. డివైడర్ను దాటి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు మరణించారు. అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/