భారత జట్టులో చేర్చుకుంటావా?

కోహ్లీకి కెవిన్‌ పీటర్‌సన్‌ కామెంట్‌

Virat Kohli
Virat Kohli

ముంబయి: ప్లాస్టిక్‌ బ్యాట్‌ పట్టిన ఓ చిన్నారి స్ట్రైట్‌ డ్రైవ్‌లు, కవర్‌ డ్రైవ్‌లు ఆడుతున్న వీడియోని ఇంగ్లాండ్‌ ఆటగాడు కెవిన్‌ పీటర్‌సన్‌ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసి అందులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనీ ట్యాగ్‌ చేశాడు. అద్భుత ప్రదర్శన కలిగిన ఆ బుడ్డోడిని టీమిండియా కెప్టెన్‌ భారత జట్టులో చేర్చుకుంటావా? అంటూ కామెంట్‌ చేశాడు. ఈ వీడియోను చూసిన కోహ్లీ ఆ బుడతడి బ్యాటింగ్‌కు ఫిదా అయిపోయాడు. డైపర్‌ ధరించి అద్భుతంగా ఆడుతున్న ఆ చిన్నోడిని ప్రశంసించాడు. అంతేకాకుండా ఈ చిన్నోడి ప్రతిభ నమ్మశక్యంగా లేదని, అతడు ఎక్కడుంటాడని కోహ్లీ కెవిన్‌ పీటర్సన్‌ను ప్రశ్నించాడు. కాగా కోహ్లీ నాయకత్వంలో భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో తలపడనుంది. అయితే ఈ సిరీస్‌లోని తొలి వన్డే చెన్నై వేదికగా జరగనుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/