పుల్వామా దాడి మసూద్‌ అజర్‌ పనే..


న్యూయార్క్‌: పాకిస్థాన్‌పై అంతర్జాతీయ సమాజ ఒత్తిడి పెరుగుతుంది. పాక్‌కు చెందిన జైషే-ఇ-మహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాది జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పిఎఫ్‌ కాన్వా§్‌ుపై సుసైడ్‌ బాంబు దాడి చేసింది మసూద్‌ అజర్‌ నేతృత్వంలో జరిగినట్లు ఐరాస ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనాతో సహా 15 సభ్యదేశాలు గురువారం జరిగిన సమావేశంలో దాడిని తీవ్రంగా నిరసిస్తూ ఖండించాయి. ఇలాంటి చర్యలకు అంతర్జాతీయ సహకారంతోనే అడ్డుకట్ట వెయ్యాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానించింది. అంతర్జాతీయ శాంతి-భద్రతలకు ఉగ్రవాదం పెనుసవాలుగా మారిందని పేర్కొంది. ఉగ్రవాద చర్యలను నిరోధించేలా..న్యాయం కోసం భారత్‌ చేపట్టబోయే చర్యలకు అన్ని దేశాలు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కోరింది.