టెక్సస్‌ యూనివర్సిటిలో ప్రొఫెసర్‌కు నిరసన సెగ

University Texas students protest
University Texas students protest

హైదరాబాద్‌: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత సంతతి ప్రొఫెసర్‌ సహోత్ర సర్కార్‌కు వ్యతిరేకంగా ఆస్టిన్‌లోని టెక్సస్‌ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తరగతి గదుల్లోకి వెళ్లి మరీ ఆయనను తరిమికొట్టారు. నగ్నంగా తనతో ఫొటోలు దిగాలని, బీచ్‌లో ఈత కొట్టాలంటూ పలువురిని సర్కార్‌ వేధించినట్టు ఆరోపణలు రావడంతో ఆయనను 2017లో ఆరు నెలలు సస్పెండ్‌ చేశారు. సర్కార్‌ను వర్సిటీ తిరిగి విధుల్లోకి తీసుకోవడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/