హైద‌రాబాద్ వ‌ర్సిటీ ప్ర‌వేశ పరీక్షల తేదీలు

university-of-hyderabad

హైదరాబాద్‌: హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు సెప్టెంబ‌ర్ 24, 25, 26వ తేదీల్లో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వ‌ర్సిటీ వీసీ ప్రొఫెస‌ర్ అప్పారావు తెలిపారు. వ‌ర్చువ‌ల్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ ద్వారా నేడు ఆయ‌న వివ‌రాల‌ను తెలియ‌జేశారు. రికార్డుస్థాయిలో ఈ ఏడాది 62,583 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. తెలంగాణ నుంచి అత్య‌ధికంగా 28,612 అప్లికేష‌న్స్ రాగా కేర‌ళ 7,019, ఢిల్లీ 5,082, ఏపి 4,250, ప‌శ్చిమ బెంగాల్‌ 3,878, ఒడిశా నుంచి 3,349 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

మొత్తం 132 కోర్సుల్లో 2,456 సీట్ల‌ను వ‌ర్సిటీ ఆఫ‌ర్ చేస్తుంది. వీటిలో 16 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 41 పీజీ కోర్సులు, 15 ఎం.ఫిల్ కోర్సులు, 10 ఎం.టెక్‌, 46 పీ.హెచ్‌డీ ప్రొగ్రామ్స్‌ను ఆఫ‌ర్ చేస్తుంది. దేశ‌వ్యాప్తంగా 38 కేంద్రాల్లో ప్ర‌వేశ ప‌రీక్ష‌లను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. కోవిడ్ నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. వ‌ర్సిటీ ప్ర‌తీ ఏడాది రెండు సెష‌న్స్‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తుండ‌గా ఈ ఏడాది మాత్రం మూడు సెష‌న్స్‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు వీసీ పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/