టెకీ దిగ్గజాలను ప్రశ్నించిన అమెరికా ప్రజాప్రతినిధులు

న‌లుగురు దిగ్గ‌జాల‌పై రిప‌బ్లిక‌న్లు, డెమోక్రాట్లు ఏక‌ధాటిగా ప్ర‌శ్న‌ల వ‌ర్షం

టెకీ దిగ్గజాలను ప్రశ్నించిన అమెరికా ప్రజాప్రతినిధులు
United in their ire, US lawmakers lash out at big tech cos leaders

అమెరికా: టెకీ సంస్థ‌లు అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్ సంస్థ‌ల‌ను అమెరికా ప్రజాప్ర‌తినిధుల ప్యానెల్ ప్ర‌శ్నించింది. మార్కెట్‌లో ఆధిప‌త్యం కోసం ఆ కంపెనీలు అనుస‌రించిన వ్యూహాల్ని హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ ప్యానెల్ నిల‌దీసింది. అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్‌, యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌, ఫేస్‌బుక్ సీఈవో జుక‌ర్‌బ‌ర్గ్‌, గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌ల‌ను క‌మిటీ ప్ర‌శ్నించింది. న‌లుగురు దిగ్గ‌జాల‌పై రిప‌బ్లిక‌న్లు, డెమోక్రాట్లు ఏక‌ధాటిగా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

మార్కెట్‌లో ఆధిప‌త్యం కోసం అమ‌లు చేసిన వ్యూహాల‌ను వారు ప్ర‌శ్నించారు. ప్యాన‌ల్‌లో 15 మంది స‌భ్యులు ఉన్నారు. సుమారు 5 గంట‌ల పాటు ఆ న‌లుగుర్నీ ప్ర‌శ్నించారు. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ స‌మావేశం జ‌రిగింది. అనేక ప్ర‌శ్న‌ల‌పై స‌మాధానం ఇవ్వ‌ని దిగ్గ‌జాలు గౌర‌వ‌భావం, మ‌ర్యాద‌తో స‌మాధానం ఇస్తున్నామ‌ని, ఎటువంటి నిజాలు దాచ‌డంలేద‌ని కుక్ తెలిపారు. గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌ను ప్యానెల్ నిల‌దీసింది. ఇత‌ర బిజినెస్ సంస్థ‌ల నుంచి కాంటెంట్‌ను దొంగ‌లిస్తున్నార‌ని గూగుల్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. స‌మ‌గ్ర‌మైన వివ‌రాలు తెలుసుకుని, వాటిని క‌మిటీకి స‌మ‌ర్పిస్తాన‌ని సుంద‌ర్ పిచాయ్ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/