స్మృతి ఇరానీ కి కరోనా పాజిటివ్‌

స్వీయ నిర్బంధంలో ఉన్నానని ట్వీట్

Smriti Irani--
Smriti Irani

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్టు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. టెస్టుల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. తనతో టచ్ లోకి వచ్చిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని చెప్పారు. మరోవైపు, స్మృతి త్వరగా కోలుకోవాలని బిజెపి నేతలు, పార్టీ కార్యకర్తలు ట్వీట్ చేస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/