కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా నెగెటివ్
ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు..స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిపిన కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ అని తేలింది. గత నెల 28న బీహార్‌లోని బోధ్‌గయ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమెకు కరోనా సోకింది. దీంతో అప్పటి నుంచి ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో తనకు కరోనా నెగిటివ్‌గా తేలిందని ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. ‘నేను కరోనా పరీక్ష చేయించుకోగా, అందులో నెగిటివ్ అని వచ్చింది. తాను కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ ప్రార్థనలు చేసిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/