‘మొక్కజొన్నపొత్తు అంత ధర అంతనా..?’ అమ్మే కుర్రాడితో కేంద్రమంత్రి వాగ్వావాదం

ఒక్క మొక్కజొన్నపొత్తు రూ. 15 రూపాయిలా అంటూ మొక్కజొన్నపొత్తులు అమ్మేకుర్రాడితో కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే వాగ్వాదం చేసాడు. వివరాల్లోకి వెళ్తే..రీసెంట్ గా కేంద్రమంత్రి కారులో ప్రయాణిస్తుండగా.. రోడ్డు పక్కన ఓ కుర్రాడు వేడి వేడి మొక్కజొన్నపొత్తులు కాలుస్తున్నాడు. అది చూసి తినాలపించి..స్వయంగా కారు దిగి వచ్చి పొత్తులు కాల్చే కుర్రాడుతో మూడు పొత్తులు కాల్పించుకున్నారు. చక్కగా నిమ్మరసం..కారం రాయించుకున్నారు. ‘ఒక్కో పొత్తూ ఎంత? అని ప్రశ్నించారు.దానికి ఆ పిల్లాడు ఒక్కో పొత్తు రూ.15 సార్..మూడు కంకులకు రూ.45 రూపాయలు.. అని చెప్పాడు. దానికి మంత్రిగారు తెగ ఆశ్చర్యపోయారు.

‘‘ఏంటీ ఒక్కోటీ రూ.15లా? మూడు కంకులకు రూ.45 రూపాయలు.. ఇంత అధిక ధరకు అమ్ముతున్నావా? అంటూ ప్రశ్నించారు. దానికి దుకాణాదారు స్పందిస్తూ.. ‘‘రూ.15 అన్నది స్టాండర్డ్ ధర. కస్టమర్ కు (కులస్తేకు) కారు ఉందని చెప్పి ధరను పెంచలేదు’’ అని అంటూ సమాధానమిచ్చాడు. దానికి మంత్రి మొక్కజొన్న ఇక్కడ ఉచితంగా లభిస్తుందని తెలుసా? అని ప్రశ్నించారు. ఎన్నో ప్రశ్నల తర్వాత మొత్తానికి తానేదో ఉదారంగా డబ్బులు చెల్లించినట్లుగా ఫోజు కొట్టి ఎలాగైతేనే డబ్బులు వచ్చేశారు. ఈ ఘనకార్యాన్ని మంత్రిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘‘నేను సియోని నుంచి మండ్లకు వెళుతున్నాను. స్థానిక మొక్కజొన్నను రుచి చూశాను. స్థానిక రైతుల నుంచి, స్థానిక వ్యాపారుల నుంచే అన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధి కల్పిస్తుంది’’ అని సలహాలు ఇస్త మంత్రి ట్వీట్ చేశారు. కానీ ఓ సామాన్య పిల్లాడి వద్ద పొత్తులు కొని కేంద్రమంత్రి స్థాయిలో వ్యక్తి అంత ధరా? అంటూ ఆశ్చర్యపోవటం..బేరాలాడిన తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. అన్ని వస్తువులపై కేంద్రం పెంచిన దానికంటే ఎక్కువనా..? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.