శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలా పర్యటన

శ్రీకాకుళం : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. పొందూరులో జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్రమంత్రితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొన్నారు. నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. నేతన్నలకు కేంద్రం నుంచి సాయం అందించాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/