ఇకపై పర్యాటక కేంద్రాలుగా లైట్‌హౌస్‌లు

వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న లైట్‌హౌస్‌లను ఎంపిక చేయాలి

light houses

న్యూఢిల్లీ: కేంద్ర నౌకాయాన సహాయ మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌. మాండవ్య మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమవేశంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న 194 లైట్‌హౌస్‌లను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకుగానూ చర్చించారు. లైట్‌హౌస్‌లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే వీటి చరిత్ర చాలామంది ప్రజలకు తెలుస్తుందని, దేశంలో టూరిజం డెవలప్‌మెంట్‌కు పనికొస్తుందని పేర్కొన్నారు. కాగా, దీనిపై సమగ్ర ప్రతిపాదనను అధికారులు మంత్రి ముందుంచారు. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న లైట్‌హౌస్‌లను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా మంత్రి వారికి సూచించారు.

అలాగే, లైట్‌హౌస్‌ల చరిత్ర, పనితీరుతో పాటు వాటి ఏర్పాటుకు వాడిన పరికరాలతో మ్యూజియం ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలన్నారు. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం మ్యూజియంతోపాటు అక్వేరియం, గార్డెన్‌, పిల్లల కోసం ఆటస్థలం, చిన్న నీటి కొలనుల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని గోప్నాథ్, ద్వారకా, వెరావాల్ లైట్‌హౌస్‌ల పర్యాటక కార్యకలాపాలను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/