ఏపి హైకోర్టు త‌ర‌లింపు అంశం త‌మ వ‌ద్ద పెండింగ్‌లో లేదు: కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు

హైకోర్టు నిర్వ‌హ‌ణ బాధ్య‌త పూర్తిగా రాష్ట్ర ప్ర‌భుత్వానిదేనని వెల్ల‌డి

union-minister-kiren-rijiju-clarifies-on-ap-high-court-transfer-to-kurnool

న్యూఢిల్లీః ఏపి హైకోర్టును అమ‌రావ‌తి నుంచి క‌ర్నూలుకు త‌ర‌లించే అంశంపై త‌మ‌కు ఇంకా పూర్తి ప్ర‌తిపాద‌న‌లు అంద‌లేద‌ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. ఈ మేర‌కు టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్ర‌శ్న‌కు స్పందించిన రిజిజు తమ స‌మాధానాన్ని లిఖితపూర్వ‌కంగా తెలియ‌జేశారు.

అయితే అమ‌రావ‌తి నుంచి ఏపీ హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించే విష‌యం కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో లేద‌ని రిజిజు వెల్ల‌డించారు. హైకోర్టు ఎక్క‌డ ఉన్నా దాని నిర్వ‌హ‌ణ బాధ్య‌త మొత్తం రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని ఆయ‌న తెలిపారు. హైకోర్టు త‌ర‌లింపు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టునే సంప్ర‌దించి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రి పేర్కొన్నారు. హైకోర్టు త‌ర‌లింపుపై ఇటు హైకోర్టుతో పాటు అటు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా త‌మ అభిప్రాయాల‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల్సి ఉంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/