రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు
వలస కూలీలను బస్సులు, రైళ్లలో స్వస్థలాలకు పంపించాలి

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలు రాసి కీలక సూచనలు చేశారు. వలస కూలీలను బస్సులు, శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు పంపించాలని ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాల నుండి వారి స్వస్థలాలకు వెళ్లుతున్న వలస కార్మికులను రోడ్డు, రైలు పట్టాల ద్వారా నడవనీయకుండా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. అలాగే వలస కూలీలు స్వస్థలాలకు చేరే వరకు వారికి నీళ్లు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని అజయ్ భల్లా చెప్పారు. వలస కూలీలకు శ్రామిక్ రైళ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్యం, పారిశుద్ధ్యం, ప్రైవేటు క్లినిక్లను తెరిచే అంశంపై కూడా అజయ్ భల్లా మరో లేఖ రాసి సూచనలు చేశారు. కాగా వలస కూలీల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన శిబిరాలను కూడా కొనసాగించాలని ఆయన సూచించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/