ఏపి పునర్విభజన చట్టంపై కేంద్రహోంశాఖ భేటి

Ministry of Home Affairs
Ministry of Home Affairs

న్యూఢిల్లీ: హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్‌ చౌహన్‌ నేతృత్వంలో ఏపి పునర్విభజన చట్టంపై కేంద్రం హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈభేటిలో విభజన చట్టంలోని 13 షెడ్యూల్‌ అమలుపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. విభజన చట్టంలోని పెండింగ్‌ విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. విభజన చట్టంతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులూఏపీ నుంచి ఐఏఎస్‌ అధికారులు నీరబ్‌కుమార్‌, కరికాల వలవన్‌తో పాటు దమయంతి, ఆరోఖ్యరాజ్‌, ప్రేమ్‌చంద్రారెడ్డి హాజరుకాగా.. తెలంగాణ నుంచి రామకృష్ణారావు, వేదాంతం గిరి హాజరయ్యారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/