పలు రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్రమంత్రి సమీక్ష

Health Minister Dr Harsh Vardhan

న్యూఢిల్లీ: కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్దన్ ప‌లు రాష్ట్రాల ఆరోగ్య‌శాఖ మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సమావేశమయ్యారు. భారత్‌లో క‌రోనా సెకండ్ వేవ్ మొద‌లైన నేప‌థ్యంలో కోవిడ్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో క‌రోనా స్థితిగ‌తుల‌పై చ‌ర్చించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అసోం, హ‌ర్యానా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌, పంజాబ్‌, రాజ‌స్థాన్‌, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఈ వ‌ర్చువ‌ల్‌ స‌మావేశంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుత ప‌రిస్థితి, క‌రోనా క‌ట్ట‌డికి అనుస‌రిస్తున్న విధానాలు త‌దిత‌ర అంశాల గురించి ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌మంత్రుల‌ను కేంద్ర‌మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేప‌ట్టాల్సిన చ‌ర్యల‌పై చ‌ర్చించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/