కేంద్ర మంత్రి హర్షవర్దన్‌కు అరుదైన గౌరవం!

డబ్ల్యూహచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ బోర్టు చైర్మన్‌గా హర్షవర్ధన్‌

union-health-minister-harsh-vardhan

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మ‌న్‌గా హ‌ర్ష‌వ‌ర్ద‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. రెండు రోజుల క్రితం జ‌రిగిన డ‌బ్ల్యూహెచ్‌వో స‌మావేశాల్లో భార‌త్‌.. ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఎంపికైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న జ‌పాన్ డాక్ట‌ర్ హిరోకి న‌క‌టాని స్థానంలో కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ వెళ్ల‌నున్నారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ నియ‌మ‌కాన్ని డ‌బ్ల్యూహెచ్‌వోలోని 194 స‌భ్య‌దేశాలు అంగీక‌రించాయి. ఈనెల 22న జ‌ర‌గ‌నున్న బోర్డు మీటింగ్‌లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌ను ఎంపిక చేస్తారు. చైర్మ‌న్ పోస్టును ఏడాది కాలం పాటు ఉంటుంది. కేవ‌లం బోర్డు స‌మావేశాల స‌మ‌యంలో మాత్ర‌మే చైర్మ‌న్ అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. మూడేళ్ల స‌భ్య‌త్వం కోసం బోర్డు స‌భ్యుల‌ను ఎంపిక చేస్తారు. 73వ డ‌బ్ల్యూహెచ్‌వో స‌మావేశాల్లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌.. కోవిడ్‌19 మ‌హమ్మారిని అడ్డుకునేందుకు భార‌త్ అన్ని చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. డ‌బ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ బోర్డులో మొత్తం 34 స‌భ్య దేశాలు ఉంటాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/