రైతులు, పేద‌ల‌కు ఏం చేస్తున్నారో చెప్ప‌లేదు : చంద్ర‌బాబు

కేంద్ర బ‌డ్జెట్ ఆశాజ‌న‌కంగా లేదు : చంద్ర‌బాబు నాయుడు


అమరావతి: కేంద్ర బ‌డ్జెట్ ఆశాజ‌న‌కంగా లేద‌ని మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర‌బ‌డ్జెట్ పై చంద్ర‌బాబు మాట్లాడుతూ…. రైతులు, పేద‌ల‌కు ఏం చేస్తున్నారో చెప్ప‌లేద‌న్నారు. న‌దుల అనుసంధానంపై ప్ర‌ణాళిక‌లు స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. వేత‌న జీవుల‌కు మొండిచేయి చూపార‌న్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు సాధించ‌డంలో వైస్సార్సీపీ విఫ‌ల‌మైంద‌న్నారు. 28మంది వైస్సార్సీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/