మహిళల కోసం కొత్త పొదుపు పథకం..

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

Union Budget 2023: FM Sitharaman Announces New Savings Scheme For Women

జీడీపీలో ద్ర‌వ్యలోటు 5.9 శాతం

జీడీపీలో ద్ర‌వ్యలోటు 5.9 శాతం ఉండే అవ‌కాశం. 2025-26 నాటికి ద్ర‌వ్య‌లోటు 4.5 శాతానికి ప‌రిమితం చేయాల‌ని ల‌క్ష్యం. బ‌హిరంగ విప‌ణి నుంచి రూ. 15.43 ల‌క్ష‌ల కోట్ల అప్పులు.

మ‌హిళా స‌మ్మాన్ బ‌చ‌త్ ప‌త్ర ప‌థ‌కం ప్రారంభం..

మ‌హిళ‌లు, బాలిక‌ల కోసం మ‌హిళా స‌మ్మాన్ బ‌చ‌త్ ప‌త్ర ప‌థ‌కం ప్రారంభం. 2025 వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నున్న మ‌హిళా స‌మ్మాన్ బ‌చ‌త్ ప‌త్ర ప‌థ‌కం. సీనియ‌ర్ సిటిజ‌న్స్ డిపాజిట్ ప‌రిమితి రూ. 15 ల‌క్ష‌ల నుంచి రూ. 30 ల‌క్ష‌లకు పెంపు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కింద మహిళా సమ్మాన్ బచత్ పత్రాన్ని ప్రకటిస్తున్నామని.. వారి కోసం కొత్త పొదుపు పథకం వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు.. దానిపై 7.5 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. ఏదైనా మహిళ లేదా అమ్మాయి ఖాతా తెరవగలరు. దాని నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు షరతులు ఉంటాయి. ఈ బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి ఇదో పెద్ద ముందడుగు.

క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు

మొబైల్స్, టీవీలు, కెమెరాల విడి భాగాల దిగుమ‌తుల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు. జౌళి మిన‌హా క‌స్ట‌మ్స్ డ్యూటీలు 21 నుంచి 13 శాతానికి త‌గ్గింపు. కిచెన్ చిమ్నీల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు.

కోస్తాలో మ‌డ అడ‌వుల అభివృద్ధికి మిస్టీ పేరుతో ప్ర‌త్యేక ప‌థ‌కం

కోస్తాలో మ‌డ అడ‌వుల అభివృద్ధికి మిస్టీ పేరుతో ప్ర‌త్యేక ప‌థ‌కం. రాంసార్ చిత్త‌డి నేల‌లు, స‌ర‌స్సుల అభివృద్ధికి ప్ర‌త్యేక నిధులు. రాంసార్ ప్రాంతాల్లోని స్థానికుల‌కు టూరిజం, ఉపాధి క‌ల్ప‌న‌లో ప్రాధాన్యం ఇస్తాం.

అత్యాధునిక సాంకేతిక‌త నేర్చుకోవ‌డానికి యువ‌త‌కు ప్రోత్సాహం

అత్యాధునిక సాంకేతిక‌త నేర్చుకోవ‌డానికి యువ‌త‌కు ప్రోత్సాహం. నాలుగో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.

ధ‌ర‌లు పెరిగేవి..

సిగ‌రెట్ల ధ‌ర‌లు, ఇంపోర్టెడ్ ర‌బ్బ‌ర్, బ‌ట్ట‌లు, బంగారం, వెండి, డైమండ్స్, సిమెంట్..

MSMEలకు రూ. 2 లక్షల కోట్ల రుణం

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ప్రారంభించబడుతోంది. MSMEలకు రూ. 2 లక్షల కోట్ల రుణం ఇవ్వడానికి ప్రణాళిక ఉందన్నారు.

MSME కోసం కీలక ప్రకటన

క్రెడిట్ గ్యారెంటీ ఎంఎస్‌ఎంఈలకు పునరుద్ధరణ పథకం వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 1 ఏప్రిల్ 2023 నుంచి పరిశ్రమలకు 9000 కోట్లు క్రెడిట్‌గా ఇవ్వబడుతుంది.

చిరు వ్యాపారుల‌కు పాన్ కార్డు త‌ప్ప‌నిసరి

చిరు వ్యాపారుల‌కు కూడా పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌కు కూడా పాన్ కార్డు త‌ప్ప‌నిసరి.

వేత‌న జీవుల‌కు ఊర‌ట‌..

రూ. 7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వేత‌న జీవుల‌కు ఊర‌ట‌. రూ. 7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు.

ఆదాయ ప‌న్ను ప‌రిమితి పెంపు

రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 7 ల‌క్ష‌లకు పెంపు. రూ. 15 ల‌క్ష‌లు దాటితే 30 శాతం ప‌న్ను చెల్లించాలి.  అయితే ఇది కొత్తపన్ను విధానంలో ఉన్నవారికే వర్తించనున్నట్లు నిర్మల పేర్కొన్నారు.