నిధుల కేటాయింపుల్లో ఏపీకి మొండిచేయి

రాష్ట్రాన్ని పక్షపాత ధోరణితో చూడటం మంచిది కాదు

ysrcp-mp-vijayasai-reddy-disappointed on-budget
ysrcp-mp-vijayasai-reddy-disappointed on-budget

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ తమకు నిరాశ కలిగించిందని వెస్సార్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిందన్నారు. పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివక్షతతో చూడటం మంచిది కాదని ఆయన హితవు పలికారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బడ్జెట్‌ నిరుపయోగమని విమర్శించారు. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం విజయసాయిరెడ్డి పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయన్నారు. డిపాజిటర్ల బీమ లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామం అన్నారు. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావల్సిన వాటా ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు కానీ ఈ విధానంలో స్పష్టత లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/