‘మహానాడు’ పై నేతలతో చంద్రబాబు చర్చలు

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు కెబినెట్‌ సమావేశానికి ముందు అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తాజా రాజకీయ పరిణామాలతో పాటు సంప్రదాయంగా ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మహానాడు అంశంపై ఆయన నేతల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే మహానాడు స్థానంలో ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా చేద్దామని పలువురు నేతలు చంద్రబాబు వద్ద ప్రతిపాదించినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం మహానాడు నిర్వహణకు సమయం సరిపోదని, జాతీయ స్థాయి సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనాల్సిన అవసరం ఉంటుందని కొందరు నేతలు సీఎం వద్ద తమ అభిప్రాయాలు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, మరిన్ని విషయాలు చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని నేతలతో చంద్రబాబు అన్నట్టు తెలిసింది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/