యుఎన్‌హెచ్‌ఆర్‌సి నిర్మాణం : పోటీ పరీక్షల ప్రత్యేకం

UNHC

యూఎన్‌హెచ్‌ఆర్‌సి నిర్మాణం అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడానికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌కు 1946 డిసెంబర్‌ 10న ఏర్పాటు చేశారు. సాంఘిక ఆర్థిక మండలిలో అంతర్భాగమైన ఈ కమిషన్‌లో 53 సభ్యదేశాలకు మూడేళ్ల పదవీకాలం సభ్యత్వ ముండేది. ప్రతి ఏటా 1/3వంతు మంది పదవీ విరమణ చేసేవారు. మానవ హక్కుల ప్రోత్సాహం, పరిరక్షణ కార్యకలాపాల నిర్వహ ణకు ఒక ఉప కమిషన్‌ పనిచేసేది. కమిషన్‌ పనితీరు అనేక విమర్శలకు గురవడంతో దాని స్థానంలో 2006 మార్చి 3న మానవహక్కుల మండలి ఏర్పాటైంది.
నిర్మాణం: యూఎన్‌హెచ్‌ఆర్‌సిలో 47 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. సర్వప్రతినిధి సభ వీరిని ఎన్నుకుంటుంది. సభ్యదేశాల పదవీకాలం మూడేళ్లు. రెండు పర్యాయాలకు మించి ఎన్నికయ్యేందుకు వీలుండదు. సభ్యదేశాల కేటాయింపు ప్రాంతాల వారీగా ఉంటుంది.
ఆఫ్రికా -13 దేశాలు ఆసియా – 13దేశాలు
తూర్పు యూరప్‌ – 6దేశాలు, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ -8దేశాలు
పశ్చిమ యూరప్‌, ఇతర గ్రూపులు -7దేశాలు, మానవ హక్కుల మండలి సర్వ ప్రతినిధి సభకు చెందిన ఉప సంస్థ, మానవ హక్కుల దుర్విని యోగం అయిన సభ్యదేశాలను తొలగించేందుకు సర్వప్రతినిధి సభకు అధికారం ఉంది.
మానవ హక్కుల మండలి ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. మూడు సంవత్సరాలకొకసారి యూఎన్‌హెచ్‌ఆర్‌సి సమావేశమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలకు పిలుపునిస్తుంది.
విధులు:

1.అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షకు కృషి చేస్తుంది.

2.మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినప్పుడు భద్రతా మండలి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించవచ్చు.

3.అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వివాదాలను మానవతా విలువలకు లోబడి మానవ హక్కులను గౌరవించి జాతి, మత లింగ, వర్ణ భేదాలు చూడకుండా పరిష్కారానికి కృషి చేస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/