రాజమండ్రి వైస్సార్సీపీలో ఊహించని పరిణామం

వైస్సార్సీపీ లో వర్గ పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకే ప్రాంతంలోని ఇరు నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకర్నొకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. రాజమండ్రి లోను ఇదే జరుగుతుంది.ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇరు నేతలు కూడా చేతులు కలుపుకున్నారు.

వైసీపీలో ఇటీవల జరిగిన సంస్థాపన మార్పుల్లో వర్గపోరుకు చెక్ పెట్టేశారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయ్యాక.. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎవరూ ఊహించని విధంగా ఎంపీ భరత్ ఇంటికి వెళ్లారు. దీంతో వారిద్దరి మధ్య వర్గపోరుకు శుభం కార్డ్ పడినట్లు అయ్యింది.