అమెరికాలో పెరగనున్న నిరుద్యోగం

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సెయింట్‌ లూయిస్‌ వెల్లడి

unemployment
unemployment

అమెరికా: కరోనా మహమ్మారి భారిన పడి అమెరికా కుదేలవుతుంది. అయితే తాజాగా తెలిసిన వివరాల ప్రకారం అమెరికాలో నిరుద్యోగ రేటు భారిగా పెరుగుతుందని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సేయింట్‌ లూయిస్‌ వెల్లడించింది. కరోనా నేపథ్యంతో నిరుద్యోగం 32.1 శాతానికి పెరుగుతుందని, దీని కారణంగా 4.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోతారని చెప్పింది. కాగా అమెరికాలో ఇప్పటికే పలు రాష్ట్రాలలో షట్‌డౌన్‌ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన సుమారు 33 లక్షల మంది నిరుద్యోగ లభ్ధికోసం దరఖాస్తు చేసుకున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/