రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు

‘హబుల్‌’ గతవారం రోజులపై టెలిస్కోప్‌

Water disputes between the two states
Water disputes between the two states

తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత, బాధ్యత పెరుగుతున్నందున దానికి అనుగుణంగా రాష్ట్రంలో నీటిపారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్‌వ్యవస్థీకరణ జరగాలని సిఎం కెసిఆర్‌ కోరుకుంటున్నారు.

జలవనరుల శాఖలో అవసరమైతే వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడిం చారు.

కోటి25లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలనే లక్ష్యంగా నీటిపారుదల శాఖను ఇక నుంచి జల వనరుల శాఖ (వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌)గా మారుస్తు న్నట్లు ప్రకటించారు.

ప్రతి రోజూ గోదావరి నుంచి నాలుగు టిఎంసీలు, కృష్ణా నుంచి మూడు టిఎంసీలు లిఫ్ట్‌ చేసి, సాగునీరు అందించేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు.

జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సిఇని ఇన్‌చార్జీగా నియమించాలి.

ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, చెరువులు, లిఫ్టులు, చెక్‌డ్యామ్‌లు సాగునీటికి సంబంధించిన సర్వసం సిఇ పరిధిలోనే ఉండాలి.

సిఇ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో ఖచ్చితమైన లెక్కలు తీయాలి. ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నందున సిఇ పరిధిలోని దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం కావాలి.

చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలి. పునర్‌వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఇఎన్సీ నుంచి లష్కరు వరకు ఎంత మంది సిబ్బంది కావాలి? ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు? అనే విషయాల్లో వాస్తవిక అంచనాలు వేయాలి. ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి.

పునర్‌ వ్యస్థీకరణలో భాగంగానే ఎంత మంది ఈఎన్సీలు ఉండాలనే విషయం నిర్దారించాలి.ఇఎన్సీ జనరల్‌, ఇఎన్సీ అడ్మినిస్ట్రేషన్‌, ఇఎన్సీ ఆపరేషన్స్‌ కూడా ఖచ్చితంగా ఉండాలి.

ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఇలా ప్రతీ చోటా ఖచ్చితంగా ఆపరేషన్‌ మాన్యువల్స్‌ రూపొందించాలి. దానికి అనుగు ణంగానే నిర్వహణ జరగాలి.

ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు పెరు గుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య న్యాయ పోరాటాలు చేసేవరకు పరిస్థితివెళ్లింది. పైగా రెండు రాష్ట్రాల్లో ఆయా ప్రభు త్వాలపై అక్కడి విపక్షాలు విమర్శల దాడులు చేస్తున్నాయి.

జలాల రక్షణలో అటు జగన్‌ప్రభుత్వం,ఇటు కెసిఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వాదనలు చేస్తున్నాయి. ఇదిలాఉంటేతాజాగా, ఎపి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపథకాన్ని నిలిపి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్ర యించింది.

సమైక్య రాష్ట్రంలోనే నదుల నీటి వాటా విషయంలో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఈ అంశాన్ని బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డులో స్పష్టంగా పేర్కొన్నారని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌పిటీషన్‌ దాఖలు చేసింది.

ఎపి ప్రభుత్వం కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను,పిలిచిన టెండర్ల ప్రక్రియను తక్షణం రద్దు చేస్తూ స్టే ఉత్తర్వులు ఇవ్వాలనికోరింది.

తద్వారా తెలంగాణ ప్రజలు న్యాయమైన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది.

వాస్తవానికి ఈ దిశలో ఎపి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇప్పటికే టెండర్లకు నోటిఫికేషన్‌ ఇచ్చిందని, రాయల సీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కిందకు వస్తుందని వాదన. ఎపి పునర్విభజనచట్టం 2014ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకంనిర్మాణం కోసం ఎపి డిపిఆర్‌లు సమర్పించాలి.

ఇరు రాష్ట్రాల సిఎంలు,కేంద్ర జలవనరుల శాఖమంత్రి సభ్యులుగా ఉండే అపెక్స్‌ కమిటీ అనుమతి పొందాలి. రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణ కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదని, రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పటి పెండింగ్‌ ప్రాజెక్టులనే పూర్తిచేస్తోందని తెలంగాణ వాదన.

కేఆర్‌ ఎంబీ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని ఎపినికోరింది.లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజ నాలకు నష్టం కలుగుతుందని, మహబూబ్‌నగర్‌ జిల్లా రైతాంగంపై తీవ్రప్రభావం చూపుతుందని తెలంగాణ సర్కార్‌ భావిస్తుంది.

అయితే, కోర్టుల్లో తెలంగాణ ప్రభుత్వ పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని గ్రహించిన ఎపి ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్లను వేసింది.సుప్రీంకోర్టు సహా రెండు రాష్ట్రాల హైకోర్టుల్లోనూ కేవి యట్‌ పిటి షన్లు దాఖలు చేసింది.

వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే ఎపి ప్రభుత్వం కేవి యట్‌ దాఖలుచేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభు త్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈఅంశం వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే, బుధవారంనాడు(ఆగస్టు 5న) జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కేంద్ర జలశక్తిశాఖ వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అపెక్స్‌ కమిటీ సమావేశానికి హాజరుకాలేనని చేసిన విజ్ఞప్తిమేరకుఈ సమా వేశాన్ని వాయిదావేస్తున్నట్లుగా సమాచారం ఇస్తూ రెండురాష్ట్రా లకు కేంద్ర జలశక్తి కార్యదర్శిలేఖ రాశారు.

మరో సమావేశం ఎప్పుడు నిర్వహించబోయేది తెలియజేస్తూ ఇరు రాష్ట్రాలకు త్వరలో సమా చారం ఇస్తామని కేంద్ర జలశక్తిశాఖ పేర్కొంది.ఈ అపెక్స్‌ సమావే శంలో రెండుతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర జల వనరుల శాఖమంత్రి పాల్గొనాల్సి ఉంటుంది.

ఆగస్టు 5న రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది.కాగా,రాష్ట్రానికి కృష్ణా జలాలు కీలక మైనవని, కృష్ణాజలాల కంటే కేబినెట్‌ సమావేశం ముఖ్యమా? అని టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

పోతిరెడ్డిపాడుప్రాజెక్టు విషయంలో సిఎం కెసిఆర్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడంలేదని,ఈ మౌనంవెనుక పెద్దకుట్రదాగి ఉందనిఆరోపించారు.

ఆగస్టు 5న అపెక్స్‌ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం సన్నద్ధం కాగా, 20వ తేదీ తరు వాత అపెక్స్‌ కమిటీ సమావేశం పెట్టమని సిఎం కెసిఆర్‌ కోరడం తెలంగాణకు ద్రోహం చేసే కుట్ర అన్నారు.

కృష్ణాజలాల వివాదంపై అపెక్స్‌ కమిటీ మీటింగ్‌ కంటే కేబినెట్‌ సమావేశం ముఖ్యమా అని ప్రశ్నించారు.

ఈ నెల 19వ తేదీ వరకు ఏపి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తుంది. పనులు ప్రారంభించాక అపెక్స్‌ కమిటీ మీటింగ్‌ పెడితే ఏం లాభమని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ఎపి చేపడుతున్న ప్రాజెక్టులు,రాయలసీమ ఇరిగేషన్‌ను ఆపేయాలన్న ఒక్కఅంశం లేదన్నారు.

సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో కర్ణాటక, మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పేరు ఎందుకు చేర్చారో ప్రభుత్వం చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌చాలాలోప భూయిష్టంగా ఉందన్నారు.

కృష్ణాజలాల్లో తెలంగాణవాటా రాకుండా పోతే సిఎం కెసిఆర్‌ బాధ్యత వహించాలన్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై తాను వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తానని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ విమర్శలను తప్పుపడుతూ కోర్టులపై తమకు నమ్మకం ఉందని,పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ప్రతిపాదనపై న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వవిప్‌లు కర్నె ప్రభాకర్‌,గువ్వల బాలరాజ్‌ వెల్లడించారు.

ఎపిని వదిలి కర్ణాటకపై పోరాటం చేస్తున్నా మని కాంగ్రెస్‌ నేతలు,దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎపి ప్రభుత్వంతో ఎలాంటి లాలూచీ లేదని రాష్ట్ర ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును టిఆర్‌ఎస్‌ ముందు నుంచీ వ్యతిరేకిస్తోం దన్నారు. గతంలో నీటి తరలింపును సమర్థించిన కాంగ్రెస్‌ నేతలు, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని కర్నెధ్వజమెత్తారు.

ఆనాడు ఆంధ్రానేత లకు మంగళహారతులు పట్టిన డీకె అరుణ వంటి నేతలు, ఇప్పుడు గొంతు చించుకొని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కెసిఆర్‌చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని స్పష్టంచేశారు.

కాగా, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.

ఎడమగట్టు విద్యుత్‌కేంద్రం ద్వారా టిఎస్‌ జెన్‌కో ఇప్పటికే 32.27టిఎంసీల నీటిని విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదుచేసింది.

ఇంకా నీరు దిగు వకు వదిలితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం,గుంటూరు జిల్లాలకు తాగునీరు ఇబ్బందులేర్పడతాయని ఎపిపేర్కొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి నీటివిడుదల ఆపాలని తెలి పింది.మొత్తంగా రెండురాష్ట్రాలు తమవాటా పరిధిలోని జలవనరుల రక్షణకు గట్టి పోరాటాలే చేస్తున్నాయి.

తాజాగా కృష్ణానదీ యాజ మాన్యబోర్డు రెండురాష్ట్రాల అవసరాల కోసం జలాలను కేటా యించింది.తెలంగాణకు 37.67 టిఎంసీలు, ఎపికి17 టిఎంసీలు విడుదల చేసేందుకు బోర్డు అనుమతించింది.

ఆగస్టు 31 వరకు ఈ నీటిని వాడుకోవచ్చునని స్పష్టం చేసింది.కాగా, నాగార్జున సాగర్‌లో 2019-20వాటర్‌ ఇయర్‌కు ఉన్న క్యారీ ఓవర్‌ స్టోరేజ్‌ నుంచి 7.746టిఎంసీల నీటిని వాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతికోరింది.

అయితే తెలంగాణ విజ్ఞప్తిని ఆంధ్రప్ర దేశ్‌ ప్రభుత్వం నిరాకరించింది. 2019-20 వాటర్‌ఇయర్‌ మే 31తో ముగిసింది.

అప్పటిలోగా నీటిని వాడుకోకపోతే ఆ కోటాను తిరిగి వినియోగించుకునే వెసులు బాటులేదంటూ ఎపి తిరకాసు పెట్టింది.ఈ విషయంపై త్వరలోజరిగే త్రిసభ్యకమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కృష్ణానదీ యాజమాన్యబోర్డు మెంబర్‌ సెక్రటరీ హరికేశ్‌ మీనా తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ,ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా,గోదావరి జలాల్లో మన హక్కును,నీటి వాటాను కాపాడుకొని తీరాలని సిఎం కెసిఆర్‌ పేర్కొంటున్నారు.

ఒక్కచుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

ఇరురాష్ట్రాల జలవివాదాల పరిష్కారం విష యంలో కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉన్నదని సమావేశం అసంతృ ప్తిని వ్యక్తంచేసింది.

కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పు డు కేంద్ర జలశక్తి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీసవ్యంగా జరిగేలాచూసే సాంప్రదాయం ఉందని,ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరురాష్ట్రాలమధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటిపంపిణీ జరగాలి. వివాదాలున్నప్పుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలి.

రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ నెలకొనిఉన్న నేపథ్యంలో, పునర్విభజనచట్టంసెక్షన్‌- 13ను అనుసరించి వీటినిపరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచీ కోరుతూ వచ్చింది.

కేంద్రం బాధ్యతారాహిత్యంవల్ల ఇరురాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల మధ్య ఉన్న కేసులు,ట్రిబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలని,నిరంతరఘర్షణ ఎవరికీమంచి దికాదని పేర్కొన్నారు.

గోదావరి,కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ఎట్టిపరిస్థితుల్లో సమగ్రంగా,సమర్థవంతంగా వినియోగించుకోవా లని,ఇందుకోసం రాజీలేనివైఖరిని అనుసరించాలని ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగాముందుకుసాగాలని కోరారు.

  • వై.నాగేశ్వరావు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/