29న ‘ఉద్యమ సింహం’

UDHYAMA SIMHAM
Udhyama Simham Trailor Released

కెసిఆర్‌ జీవిత కథ కాదు : కల్వకుంట్ల నాగేశ్వరరావు

తెలంగాణ పోరాట నేపథ్య కథతో తెరకెక్కినచిత్రం ఉద్యమ సింహం.. నటరాజన్‌, మాధవి రెడ్డి , జలగం సుధీర్‌, లథ, ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు.. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ట్రైలర్‌ ఆవిస్కరణ ఫిలింఛాంబర్‌లో జరిగింది.. ఈసందర్భంగా కల్వకుంట్ల నాగేశ్వరరావు ట్రైలర్‌ను విడుదల చేశారు.. ఈచిత్రం కెసిఆర్‌ జీవిత కథ కాదని అన్నారు.. ఇది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోకెసిఆర్‌ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ అన్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాడి తెలంగాణను కెసిఆర్‌ సాధించిపెట్టారని, ఆ తర్వాత దాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషి ఏమిటన్నది ఈసినిమా అన్నారు.. కెసిఆర్‌ పాత్రలోనటరాజన్‌ చక్కగా నటించారన్నారు..
కార్యక్రమంలో దర్శకుడుకృష్ణంరాజు, నటి లతా, మాటల రచయిత రాపోలు, సూర్య, సాహితయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.