మణిరత్నం మల్టీస్టారర్ లో

Trisha In ManiRatnam Direction
Trisha In ManiRatnam Direction

 ఫిలింమేకర్ మణిరత్నం ప్రయోగాల గురించి తెలిసిందే. మూడు దశాబ్ధాల కెరీర్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాల్ని తెరకెక్కించారు. ఇందులో పరాజయాల శాతం ఎక్కువగా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు అంతే హాట్ డిబేట్ కి తెరతీశాయి. అందుకే ఆయన ఓ సినిమా తీస్తున్నారు అంటే దేశవ్యాప్తంగా దానిపై వాడి వేడిగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం అతడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` పై సీరియస్ గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతున్న కొద్దీ అంతకంతకు పెద్ద కాన్వాసుకు మారుతోంది. తమిళం-తెలుగు- హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించనున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్- విక్రమ్- ఐశ్వర్య రాయ్- విజయ్ సేతుపతి- మోహన్ బాబు- జయం రవి- కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా కొలీవుడ్ సర్కిల్స్ నుండి అందిన సమాచారం ప్రకారం.. స్టార్ హీరోయిన్ త్రిషతో ఓ ప్రత్యేక  పాత్ర కోసం దర్శకమణి సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.  త్రిష పాత్ర ఏమిటి.. అన్నదానిపై వివరాలు తెలియాల్సి ఉంది. త్రిష ఓకే చెప్పిందా లేదా అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. మణి సర్ తెరకెక్కించిన `యువ` చిత్రంలో త్రిష ఓ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిరత్నం ఆఫర్ ని రిజెక్ట్ చేయదనే భావిస్తున్నారు