పృథ్వీషాని ప్రశంసించిన సెహ్వాగ్‌ …..

SEHWAG-
SEHWAG

స్యూఢిల్లీ ప్రభాతవార్త : టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్తాను కనుక కెప్టెన్‌ను అయి ఉంటే టెస్టుల్లో పృథ్వీషా, రాహుల్‌లను ఓపెనర్లుగా పంపుతానని అన్నాడు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరైన విఫలమైతే అప్పుడు మురళీ విజయ్‌కు ఆ అవకాశం ఇస్తానని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా మురళీ విజయ్ మరింత మెరుగుపడాల్సిన అవసరంఉందన్ని ఆయన అన్నారు. పృథ్వీషాకు మంచి భవిష్యత్తు ఉందని, అరంగేట్ర టెస్టులోనే సెంచరీ బాది, మరో మ్యాచ్‌లో 60కి పైగా పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడని ప్రశంసించాడు. పృథ్వీషా మరో పది పన్నెండేళ్లు భేషుగ్గా ఆడగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.