బిజెపి నేతలపై రాహుల్‌ ట్వీట్‌

Rahul Gandhi
Rahul Gandhi

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు గాడ్‌ కే లవర్స్‌ కాదని, వాళ్లు గాడ్‌సే లవర్స్‌ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. మహాత్మా గాంధీని ఒకరు పాక్‌ జాతిపిత అని, గాడ్సేను దేశభక్తుడని మరోకరు కామెంట్లు చేశారు. బిజెపి నేతలైన ప్రజ్ఞా సింగ్‌ థాకూర్‌, అనిల్‌ సౌమిత్ర వ్యాఖ్యలపై ఆయన ఈ ట్వీట్‌ చేశారు. ఐతే వీరి వ్యాఖ్యలపై బిజెపి స్పందించింది. ప్రగ్యా సింగ్‌ వ్యాఖ్యలపై మోది కూడా మండిపడ్డారు. అనిల్‌ సౌమిత్రను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/