ప్రధాని ‘ఆరు విజయాలు’ సాధించారంటూ విమర్శలు

ఫిబ్రవరిలో ‘నమస్తే ట్రంప్’ నిర్వహించారు

rahul-gandhi

న్యూఢిల్లీ: ప్రధాని మోడిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని, ప్రధాని ఆరు విజయాలు సాధించారంటూ ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు.

”కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మోడి సాధించిన విజయాలు..


•ఫిబ్రవరినమస్తే ట్రంప్
• మార్చిమధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూల్చడం
• ఏప్రిల్ ప్రజలతో కొవ్వొత్తులు వెలిగింపజేయడం
• మేఎన్డీఏ ప్రభుత్వ ఆరో వార్షికోత్సవం జరుపుకోవడం
• జూన్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల వర్చువల్ ర్యాలీలు నిర్వహించడం
•జూలై రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేయడం

అందుకే కరోనాపై పోరాటం చేయడంలో దేశ ప్రజలు తమపై తామే ఆధారపడ్డారు” అని రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/