రేపు యుపి పర్యటనకు ప్రియాంక గాంధీ

priyanka gandhi, Jyotiraditya Scindia
priyanka gandhi, Jyotiraditya Scindia

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఈ నెల 11న యుపిలో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె యుపిలో పర్యటించడం ఇదే మొదటిసారి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమికి గల కారణాలపై పార్టీ నాయకులతో ప్రియాంక 11వ తేదీన చర్చించనున్నారు. ఈ సమావేశానికి జ్యోతిరాధిత్య సింధియా కూడా హాజరు కానున్నారు. ఐతే యుపిలో 80 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ ఒకే ఒక్క లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అది రా§్‌ుబరేలిలోని నియోజకవర్గం నుంచి సోనియాగాంధీ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/