ప్రజావాక్కు: సమస్యలపై గళం

Voice of the People
Voice of the People

ప్రహారీగోడలు లేని ప్రభుత్వ పాఠశాలలెన్నో!-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట, భూపాలపల్లిజిల్లా

తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ప్రహారీగోడలు లేకపోవడంతో పాఠశాల ఆవరణలో హరిత హారంకింద నాటిన మొక్కలు రక్షణ లేకుండా పశువ్ఞలకు ఆహా రంగా మారుతున్నాయి. ప్రతీపాఠశాలను పచ్చదనం, పరిశుభ్ర తతో నింపాలని ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్‌లో విద్యారంగా నికి నిధులు కేటాయించినా, పాఠశాలల రూపురేఖలు మార డంలేదు. అనేక పాఠశాలలకు ప్రహారీగోడలు లేకపోవడంతో పశువ్ఞలు పాఠశాల వాతావరణాన్ని మల, మూత్రాలతో దుర్గం ధంవ్యాపించేలా నింపేస్తున్నాయి.నాటిన మొక్కలను భక్షిస్తు న్నాయి.తద్వారా పాఠశాలలోమొక్కలుపెరగక పచ్చదనంకరవ్ఞ అవ్ఞతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రహారీగోడలు లేని పాఠశాలలను తక్షణమే గుర్తించి యుద్ధప్రాతిపదికన నిర్మించాలి. ప్రతి పాఠశా లను పచ్చదనంతో నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

క్రికెట్‌ సిరీస్‌ల మధ్య గ్యాప్‌ ఉండాలి- మిథునం, హైదరాబాద్‌

ప్రతిభ కారణమో అదృష్టం పట్టుకుని వదలకపోవడం వల్లనో కాలం కలిసి రావటమో దైవం అనుకూలించడంతోనో మొత్తాని కి టీమ్‌ఇండియా ప్రభుత్వం అద్భుత విజయాలను సాధిస్తోం ది.అగ్రశ్రేణి జట్లనుసైతం అలవోకగా మట్టి కరిపించగలుగుతోం ది. ఓటమి ఎరుగని మేటి జట్టుగా ఎదగగలుగుతోంది. అయితే ఈ మధ్య క్రికెట్‌ సీరిస్‌లు మరీ ఎక్కువపోయాయి. మన దేశానికి విదేశీ జట్టు రావటమో మనదేశం విదేశానికి వెళ్లటం అనేది వెంటవెంటనే జరిగిపోతున్నాయి. సీరిస్‌ల మధ్య గ్యాప్‌ అనేది అస్సలు ఉండటం లేదు. ఈ కారణంతో ఆటగాళ్లు వి శ్రాంతి తీసుకోవడానికి కానీ, కుటుంబ సభ్యులతో గడపటానికి సమయం అనేది ఉండటం లేదు.

పిఆర్‌సిపై జాప్యం వద్దు -సయ్యద్‌ షఫీ, హన్మకొండ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తుంది.2018జులైలో పిఆర్‌సిఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పాటు అయిన ప్రభుత్వం పిఆర్‌సి చెల్లిస్తుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రప్రభుత్వాలు ఆదర్శంగా అనుసరిస్తున్నా యి. ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర సాధనలోనే కాదు బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం లో నిత్య అవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉద్యోగుల పిఆర్‌సి ప్రకటన చేస్తారని ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల సంస్కరణలు అవసరం -డా.డి.వి.జి శంకరరావ్ఞ, పార్వతీపురం

ఎన్నికల్లో అభ్యర్థులుగా నేరస్తులు రాకుండా దేశంలో జరుగు తున్నఎన్నికల సంస్కరణలు అభ్యర్థనల స్థాయి దాటడం లేదు. సుప్రీంకోర్టు రాజకీయ పార్టీల్ని నేరచరితుల వివరాల్ని వెంటనే ప్రజల ముందు పెట్టాలన్న ఆదేశం కూడా వాస్తవంలో ఎంత ప్రభావం చూపగలదో వేచిచూడాల్సిందే. పదేళ్లలో శాసన వ్యవ స్థలో చేరిన నేరచరితుల సంఖ్య 106 శాతం పెరిగిన వాస్తవం చూస్తేనే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది.అత్యున్నత శాసన వ్యవస్థ, పార్లమెంటులో క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నవారు 43 శాతం మంది ఉన్నారు. అందులో తీవ్ర నేరారోపణలున్నవారు కూడా అధికమే. కర్ణాటకలో అటవీ ప్రాంతానికి సంబంధించిన నేరాల్లో కేసుఎదుర్కొంటున్న ఎమ్మెల్యే, అటవీమంత్రిగా బాధ్య తలు చేపట్టారు. గెలవగలగడం ఒక్కటే ప్రాతిపదిక కాకుండా, వ్యక్తిత్వాన్ని లెక్కలోకి తీసుకొమ్మని సుప్రీం చెప్తోంది.

తాగు నీటికి కటకటే! -గరిమెళ్లరామకృష్ణ, గన్నవరం, కృష్ణాజిల్లా

రాష్ట్రంలోని కోస్తాతీర ప్రాంత గ్రామాలు వేసవికి ముందే తాగు నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.పాలకులు హామీలు ఇవ్వడం, బడ్జెట్‌లో కేటాయింపులు చేసినా ఎక్కడా నిధులు విడుదల చేయడంకానీ,పనులు మొదలుపెట్టిన దాఖలాలుకానీ మృగ్యం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతలు ఓట్లకోసం మరోసారి ఊదరగొడతారు తప్పితే సమస్య పరిష్కా రంకాదు. గ్రామాల్లోని ప్రజలు నిధులు విడుదల చేసి పనులు మొదలు పెట్టి ఓట్లు అడగమని నేతలను నిలదీయాలి. లేకుంటే రానున్న 4 సంII మాటలతోనే మభ్యపెట్టడం ఖాయం.

ఎన్‌ఆర్‌సి అమలు చేయాలి -బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల, కర్నూలు

ఇతర దేశాలలో ఉన్న మాదిరే ఎన్‌ఆర్‌సి అమలులో ఉండటం తో ఏమాత్రం తప్పులేదు. అయితే మనదేశంలో ఉన్న ముస్లిం లు దీన్ని అపార్థం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ముమ్మా టికీ కేంద్ర ప్రభుత్వానిదే. అయితే ఇందుకు సంబంధించిన విష యంలో కొంత మంది బిజెపి నాయకులు అనవసర వ్యాఖ్యలు, కామెంట్స్‌ చేయకుండా కట్టడి చేయాల్సిన అవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అలాగే ఈ విషయంలో కాస్తంత ఓర్పు వహించాలి. అన్ని మతాల ప్రజలు ఎన్‌ఆర్‌సి అంటే ఏమిటో చాలా క్లుప్తంగా తెలుసుకోవాలి. ఎవరో మతపెద్దలు చెప్పిన మాటలు విని పక్కదోవ పట్టే ప్రయత్నం చేయకూడదు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/