రెండేళ్లలో ఐపిఒకు వస్తున్న పేటిఎం

paytm
paytm


న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆన్‌లైన్‌షాపింగ్‌లో దిగ్గజంగా వెలుగొందుతున్న ప్రైవేటు సంస్థ పేటిఎం వచ్చే రెండేళ్లలో ఐపిఒకు వస్తున్నదని సిఇఒ విజ§్‌ుశేఖర్‌శర్మ వెల్లడించారు. నగదు లభ్యతను మరింతగాపెంచుకునేందుకు వీలుగా తాను సంస్థను స్టాక్‌ ఎక్ఛేంజిల్లో లిస్టింగ్‌కు వస్తున్నట్లు వివరించారు. బాండ్లజారీకి తాను అనువుగా ఉన్నట్లు భావించిన వెంటనే తాను ఐదేళ్లకాలానికి విక్రయిస్తానని ఆ తర్వాత స్టాక్‌ఎక్చేంజిల్లో జాబితాకు వెళతానని వెల్లడించారు. కంపెనీ వాటాదారులకు స్థిరమైన రిటర్నులు కల్పించేందుకు ఇదే అనువైన సమయమని వెల్లడించారు. ఇందుకోసం సంస్థ రానున్న 22-24 నెలల్లో ఐపిఒకు రావాలని యోచిస్తున్నట్లు సిఇఒ వెల్లడించారు. భారత్‌ ఇకామర్స్‌, డిజిటల్‌ పేమెంట్స్‌లో దిగ్గజంగా ఉన్న సంస్థ 300 మిలియన్‌ డాలర్లను వారెన్‌బఫెట్‌ బెర్క్‌షౌర్‌ హాత్‌వేనుంచి 2018లోనే సాధించింది. సంస్థ విలువలుసైతం 15 బిలియన్‌డాలర్లుగా పెరిగినట్లుశర్మ ఇటీవలే వెల్లడించారు.పేటిఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ సంస్థ భారత్‌లో అత్యంత ఏకీకృత సంస్థగా నిలుస్తుంది. స్టార్టప్‌ కంపనీగా వచ్చిన సంస్థ ఇపుడు వందకోట్ల డాలర్లకు పైబడి ఉంటుందని అంచనా. సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ఫండ్‌ మాసాయోషిసాన్‌ ఆలిబాబాగ్రూప్‌ యాంట్‌ ఫైనాన్షియల్స్‌ సైతం ఇందుకు ముందుకువచ్చాయి. ఇక పబ్లిక్‌ లిస్టింగ్‌అనేది అనివార్యమని ఇందుకోసం ఒక రోడ్‌మాప్‌ను రూపొందిస్తున్నట్లు వివరించారు. మొత్తం ఐదుశాతం మార్జిన్లలో తగ్గుదల కనిపించవచ్చని, అవసరమైతే 10శాతానికిసైతం పోవచ్చని అన్నారు. వీటన్నింటినీ అధిగమించేందుకు వచ్చే రెండేళ్లలోనే తాను నగదు లభ్యతకోసంఐపిఒకు వస్తానని వెల్లడించారు. ఒకదశలో అనువుగా ఉంటే ఐదేళ్లకాలానికి బాండ్లనుజారీచేస్తానని, ఆ తర్వాతే లిస్టింగ్‌కువెళతానని వెల్లడించారు. వెంచర్‌ క్యాపిటలిస్టులకుసైతం ఈ ఏడాది స్టార్టప్‌లలోపెట్టుబడులు కలిసొస్తున్నట్లు వివరించారు. భారతీయ స్టార్టప్‌లు సుమారు 3.9 బిలియన్‌ డాలర్లు వెంచర్‌ కేపిటల్స్‌నుంచి తెస్తున్నట్లు వివరించారు. 2016,2017 ఆర్ధికసంవత్సరాల్లోని నిధులసమీకరణను అధిగమించాయి. ఇన్వెస్టర్లలో ధీమా పెరగడమే ఇందుకుకారణం. ఎన్నికల తర్వాత ఆశావాదం మరింతపెరిగింది. ఫ్లిప్‌కార్ట్‌ 16 బిలియన్‌ డాలర్లుతో వాల్‌మార్ట్‌కు విక్రయించింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/