త‌మ దేశంలో జీరో కేసులు..కిమ్ జాంగ్‌

ప్ర‌స్తుతం దేశంలో ప‌రిస్థితి స్థిరంగా ఉంది..‌ కిమ్ జాంగ్‌

Kim Jong Un
Kim Jong Un

ఉ.కొరియా: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తాము ముందు చూపుతో చేపట్టిన పగడ్భందీ చర్యలు అద్భుత ఫలితాన్ని ఇచ్చినట్లు ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. పోలిట్‌బ్యూరో మీటింగ్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. ప్ర‌స్తుతం దేశంలో ప‌రిస్థితి స్థిరంగా ఉంద‌ని, వైర‌స్ సంక్ర‌మ‌ణ భీక‌ర స్థాయికి వెళ్ల‌కుండా చేసిన‌ట్లు కిమ్ తెలిపారు. వైర‌స్‌పై విజ‌యం సాధించినా.. గ‌రిష్ట స్థాయిలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఎటువంటి నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించ‌రాద‌న్నారు. త‌మ దేశంలో జీరో కేసులు ఉన్న‌ట్లు నార్త్ కొరియా చెప్పుకుంటున్న‌ది. ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని తమ దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోగలిగినట్లు .. కిమ్ చొప్పుకొచ్చారు. అదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులకు చోటు కల్పించకుండా దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కిమ్ సూచించారు. ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను యధాతథంగా కొనసాగించాలని, లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తొందరపాటుతో ఆంక్షలను సడలిస్తే ఊహలకు మించిన సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు సతమతమవుతున్నా…తాను దేశ ప్రజలను తాను కాపాడగలిగినట్లు కిమ్ చొప్పుకొచ్చారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/